Producer Krishnaveni Passes Away: అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (101) కన్నుమూత..వృద్దాప్య సమస్యలతో తుది శ్వాస విడిచిన కృష్ణవేణి
అలనాటి నటి , నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు. 1936లో సతీ అనసూయతో సినిమా రంగానికి పరిచయం అయ్యారు కృష్ణవేణి. 1949లో మనదేశం సినిమా నిర్మాతగా ఎన్టీఆర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు కృష్ణవేణి
అలనాటి నటి , నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు. 1936లో సతీ అనసూయతో సినిమా రంగానికి పరిచయం అయ్యారు కృష్ణవేణి. 1949లో మనదేశం సినిమా నిర్మాతగా ఎన్టీఆర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు కృష్ణవేణి(Producer Krishnaveni Passes Away).
మీర్జాపురం రాజాతో కృష్ణవేణి ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు కృష్ణవేణి(Producer Krishnaveni).
బాల నటిగా కొనసాగుతూనే తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటించి మెప్పించారు. మీర్జాపురం రాజా, మేక రంగయ్య వంటి చిత్రాలను ఆమె నిర్మించారు. 2004లో కృష్ణవేణికి రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది.
అరసవల్లి ఆలయం వివాదంపై సింగర్ మంగ్లీ లేఖ..దేవుడి కార్యక్రమానికి రాజకీయ ముద్ర వేస్తారా? అంటూ ప్రశ్న
ఇటీవలే ఎన్.టి.ఆర్. వజ్రోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. కృష్ణవేణిని సత్కరించిన సంగతి తెలిసిందే.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)