Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరుడు సెకండ్ ప్రోమో విడుదల, ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు అంటున్న ఎన్టీఆర్
ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు' అంటూ ఈ కొత్త ప్రోమోలో ఎన్టీఆర్ మరో డైలాగు చెప్పాడు. ఇక్కడ 'కల మీది కథ మీది. ఆట నాది, కోటి మీది' అంటూ ఎన్టీఆర్ ప్రేక్షకులను పలకరిస్తున్నాడు.
గతంలో నాగార్జున, చిరంజీవి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అంటూ జెమినీ టీవీ షోలో అలరించిన విషయం తెలిసిందే. ఈసారి ఈ షో జెమినీ టీవీలో 'ఎవరు మీలో కోటీశ్వరుడు' పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'రండి గెలుద్దాం... ఎవరు మీలో కోటీశ్వరులు' అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైలాగు చెప్పిన తొలి ప్రోమో కూడా ఇప్పటికే విడుదలైంది. ఈ రోజు ఈ షో నుంచి మరో ప్రోమో విడుదల చేశారు.
'ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు' అంటూ ఈ కొత్త ప్రోమోలో ఎన్టీఆర్ మరో డైలాగు చెప్పాడు. ఇక్కడ 'కల మీది కథ మీది. ఆట నాది, కోటి మీది' అంటూ ఎన్టీఆర్ ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఈ ఆగస్టులోనే ఈ షో గర్జిస్తుందని జెమినీ టీవీ పేర్కొంది. గతంలో ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1లోనూ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రోగ్రాంతో మరోసారి అలరించడానికి సిద్ధమయ్యాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)