Vijay Deverakonda: అభిమానులకు విజయ దేవరకొండ నుంచి ఊహించని గిఫ్ట్.. మనాలీ ట్రిప్ కు 100 మంది
విజయ్ దేవరకొండ తన అభిమానుల కోసం ఊహించని విధంగా న్యూ ఇయర్ గిఫ్ట్ తో సర్ ప్రైజ్ ఇచ్చాడు. మనాలీలో మంచు పర్వతాల అందాలను చూసేందుకు 100 మంది అభిమానులను పంపిస్తానని ప్రకటించాడు.
Hyderabad, Jan 9: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన అభిమానుల (Fans) కోసం ఊహించని విధంగా న్యూ ఇయర్ గిఫ్ట్ తో (Newyear Gift) సర్ ప్రైజ్ ఇచ్చాడు. మనాలీలో (Manali) మంచు పర్వతాల అందాలను చూసేందుకు 100 మంది అభిమానులను పంపిస్తానని ప్రకటించాడు. ఇందుకు సంబంధించి ఇన్ స్టా గ్రామ్ (Instagram) ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ‘‘ఆహారం, ప్రయాణం, వసతి అంతా నేనే చూసుకుంటాను. మనాలీకి ఐదు రోజుల పర్యటన ఉంటుంది.
మంచు దుప్పటేసిన పర్వతాలకు, ఆలయాలకు, మఠాలకు వెళతారు. ఎన్నో యాక్టివిటీలకు ప్లాన్ చేశాను. 18 ఏళ్లు నిండి, నన్ను అనుసరించే వారు గూగుల్ డాక్యుమెంట్ ను ఫిల్ చేయండి. మీలో 100 మందిని ఎంపిక చేసి మనాలీకి పంపిస్తాను. మీతో నేను కూడా జాయిన్ అవుతాను’’అని విజయ్ దేవరకొండ అభిమానులకు ఊహించని కానుకను ప్రకటించాడు. ఆ వీడియో మీరూ చూడండి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)