UP Tollplaza Accident: యూపీలో పూణే తరహా కారు భీభత్సం.. టోల్‌ప్లాజా సిబ్బందిపై కారెక్కించి ఫరార్

దీనికి సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతోంది.

Credit: Twitter

పూణేలో జరిగిన కారు భీభత్సం ఘటన మరువకముందే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతోంది. వివరాల్లోకి వెళితే.. దిల్లీ-లఖ్‌నవూ హైవేపై హాపుడ్ జిల్లా పరిథిలో ఓ టోల్ ప్లాజా ఉంది. గురువారం రాత్రి వేగంగా వచ్చిన ఓ కారు టోల్ ప్లాజాలో పనిచేస్తున్న ఓ వ్యక్తిని బలంగా ఢీకొంది. దీంతో బాధితుడు దాదాపు 10 అడుగుల ఎత్తు గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు. అయితే ఇంత దారుణానికి తెగబడి కూడా కారు డ్రైవర్ ఏ మాత్రం కారు ఆపకుండా అక్కడి నుంచి పారిపోయాడు.  ఎన్డీఏ సమావేశంలో ఆసక్తికర దృశ్యం.. వైరల్ అవుతున్న ప్రధాని మోదీ వీడియో

తీవ్ర గాయాలపాలైన యువకుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కాగా.. సీసీటీవీలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ కావడంతో.. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. కారు ఎవరిదో గుర్తించి దాని ఓనర్‌ను వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)