‘Dance Jihad’: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇద్దరు వైద్య విద్యార్థుల డ్యాన్స్, రాస్‌పూటిన్ సాంగ్‌కి వైవిధ్యంగా డ్యాన్స్, త్రిస్పూర్ మెడికల్ కాలేజీకి చెందిన జానకి ఓం కుమార్, నవీన్ కె రజాలపై ప్రశంసల వర్షం
కేరళకు చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారిద్దరు మెడికల్ కాలేజీ యూనిఫామ్‌లోనే అద్భుతమైన ఫుట్ వర్క్, సున్నితమైన కదలికలు, పాటకు తగిన హావభావాలను పలికిస్తూ చాలా వైవిధ్యంగా డ్యాన్స్ చేశారు. త్రిస్పూర్ మెడికల్ కాలేజీకి చెందిన జానకి ఓం కుమార్, నవీన్ కె రజాక్ ప్రముఖ బోనీ ఎం గ్రూప్‌కు చెందిన రాస్‌పూటిన్ సాంగ్‌కు ఇద్దరు అద్భుతంగా తమ కాలేజీ కారిడార్‌లో చిందులు వేశారు.
జానకి మెడిసిన్ మూడో ఏడాది విద్యార్థిని, నవీన్ నాలుగో ఏడాది విద్యార్థి. ముందుగా వారు చేసిన డ్యాన్స్ వీడియోను నవీన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత జానకి తన యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో ఒక్కసారిగా వారు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ డ్యాన్స్ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘వావ్.. చాలా అద్భుతం, నా బాల్యాన్ని జానకి, నవీన్ గుర్తుచేశారు. రాస్‌పూటిన్ సాంగ్ బీట్ నా హృదయానికి సున్నితంగా తగిలింది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వైద్య విద్యార్థుల డ్యాన్స్ చూశాక నా మతిపోయింది’, ‘వారు ధరించిన ష్యూ డ్యాన్స్ చేయడానికి చాలా సౌకర్యంగా ఉంది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ పిల్లలు వారి విభిన్న మతాల కారణంగా హిందుత్వ విషం వారిపై చిందులు వేయడానికి బదులుగా చప్పట్లు మరియు ప్రోత్సాహానికి అర్హులు. వారు యంగ్ ఇండియాలో అత్యుత్తమమైన టాలెంట్ & కామ్రేడ్ షిప్ రెండింటినీ చూస్తారు. మరియు వారు ఒక రోజు సానుభూతిపరులైన వైద్యులను చేస్తారు అంటూ కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ట్వీట్ చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)