APPSC Group 1 Mains Result 2023 Declared: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల, ఇంటర్వ్యూలు తేదీ ఇదిగో..

ఏపీలో ఇటీవల జరిగిన ఏపీపీఎస్సీ(APPSC) గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జూన్‌ 3 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 5,028 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.

Representational Picture. Credits: PTI

ఏపీలో ఇటీవల జరిగిన ఏపీపీఎస్సీ(APPSC) గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జూన్‌ 3 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 5,028 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన అధికారులు.. మొత్తం 111 గ్రూప్‌ 1 ఉద్యోగాలకు గాను 259 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేసినట్టు వెల్లడించారు. వీరిలో 39 మందిని స్పోర్ట్స్‌ కోటాలో ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఫలితాలను శుక్రవారం సాయంత్రం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇదే..

స్పోర్ట్స్‌ కోటాలో ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇదే..

Representational Picture. Credits: PTI

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now