CAT 2022 Result Declared: క్యాట్ ఫలితాలు విడుదల, దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ స్కోర్ సాధించిన 11 మంది విద్యార్ధులు, 99.99 పర్సంటైల్ స్కోర్ సాధించిన 22 మంది
ఐఐఎంలు, ఇతర మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్టు (క్యాట్) ఫలితాలను ఐఐఎం బెంగళూరు బుధవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 11 మంది 100, 22 మంది 99.99 పర్సంటైల్ స్కోర్ సాధించారు. 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థుల్లో ఇద్దరు తెలంగాణకు చెందిన వారున్నారు.
ఐఐఎంలు, ఇతర మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్టు (క్యాట్) ఫలితాలను ఐఐఎం బెంగళూరు బుధవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 11 మంది 100, 22 మంది 99.99 పర్సంటైల్ స్కోర్ సాధించారు. 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థుల్లో ఇద్దరు తెలంగాణకు చెందిన వారున్నారు. నవంబరు 27న ‘క్యాట్’ నిర్వహించగా 2.22 లక్షల మంది హాజరయ్యారు.
100 పర్సంటైల్ సాధించిన వారిలో తెలంగాణ, దిల్లీ, మహారాష్ట్రలకు చెందిన వారు ఇద్దరేసి చొప్పున.. గుజరాత్, హరియాణా, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. 99.98 నుంచి 100 మధ్య పర్సంటైల్ సాధించిన వారు 55 మంది ఉన్నారు. వారిలో నలుగురు అమ్మాయిలు.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)