JEE Main 2022: జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు వాయిదా, కొత్త తేదీలను ప్రకటించిన ఎన్టీఏ
ఇదివరకు విడుదలైన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు ఈ నెల 21 (గురువారం) నుంచి ఈ నెల 30 వరకు నిర్వహించాల్సి ఉంది.
దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇదివరకు విడుదలైన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు ఈ నెల 21 (గురువారం) నుంచి ఈ నెల 30 వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే పరీక్షకు ఒక రోజు ముందుగా ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం సాయంత్రం ప్రకటించింది. పరీక్షల వాయిదాకు గల కారణాలను ఎన్టీఏ వెల్లడించలేదు.
ఈ క్రమంలో జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలను ఈ నెల 25 నుంచి నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను గురువారం నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించిన ఎన్టీఏ.. ఈ నెల 11న ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)