JNTUH Job Fair: హైదరాబాద్ లో నేడు జేఎన్టీయూలో మెగా జాబ్‌మేళా.. పాల్గొననున్న 100 కంపెనీలు.. 10 వేల ఉద్యోగాలు పొందే అవకాశం

ఈ జాబ్ ఫెయిర్ ను సద్వినియోగం చేసుకోవాలని వర్సిటీ వీసీ కట్టా నర్సింహారెడ్డి కోరారు. జేఎన్‌టీయూహెచ్‌ వర్సిటీ, నిపుణ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, సేవా ఇంటర్నేషనల్‌ సంస్థల ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

Jobs. (Representational Image | File)

Hyderabad, Dec 16: జేఎన్‌టీయూలో (JNTU) నేడు మెగా జాబ్‌మేళా (Mega Job Mela) జరుగనున్నది. ఈ జాబ్ ఫెయిర్ (Job Fair) ను సద్వినియోగం చేసుకోవాలని వర్సిటీ వీసీ కట్టా నర్సింహారెడ్డి కోరారు. జేఎన్‌టీయూహెచ్‌ (JNTUH) వర్సిటీ, నిపుణ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, సేవా ఇంటర్నేషనల్‌ సంస్థల ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మెగా జాబ్‌మేళాలో 100 ప్రముఖ కంపెనీలు హాజరవుతాయని.. 10వేల ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వీసీ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్‌, డిప్లమా, ఐఐటీ, బీటెక్‌, ఎంటెక్‌, ఆల్‌ గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ 2016 నుంచి 2023 వరకు ఉత్తీర్ణులైన వారంతా అర్హులు. ఐటీ, ఐటీఈఎస్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మా, కోర్‌, బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌ రంగాల్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

Google Maps New Feature: బండిలో పెట్రోల్ ఆదా చేసుకునేలా గూగుల్‌ మ్యాప్‌ లో కొత్త ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే??

Jobs. (Representational Image | File)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)