Fake Universities: ఏపీలో రెండు ఫేక్ యూనివర్సిటీలు, దేశంలో మొత్తం 20 యూనివర్సిటీలను ఫేక్ అని నిర్ధారించిన యూజీసీ, లిస్ట్ ఇదిగో..

ఈ నకిలీ విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే డిగ్రీలు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. ఈ డిగ్రీలు ఉన్నత విద్యాభ్యాసానికి గానీ, ఉద్యోగాలు పొందేందుకు గానీ ఉపయోగపడవని యూజీసీ స్పష్టం చేసింది.

University Grants Commission (Photo-Wikimedia Commons)

దేశంలోని ఓ 20 యూనివర్సిటీలను ఫేక్ అని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. ఈ నకిలీ విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే డిగ్రీలు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. ఈ డిగ్రీలు ఉన్నత విద్యాభ్యాసానికి గానీ, ఉద్యోగాలు పొందేందుకు గానీ ఉపయోగపడవని యూజీసీ స్పష్టం చేసింది. ఈ మేరకు యూజీసీ కార్యదర్శి మనీశ్ జోషి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ 20 వర్సిటీల్లో అత్యధిక శాతం ఢిల్లీలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో యూపీ ఉంది. ఏపీకి చెందిన రెండు విశ్వవిద్యాలయాలు కూడా నకిలీవేనని యూజీసీ తేల్చింది.

యూజీసీ ప్రకటించిన నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా...

1. క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ- ఆంధ్రప్రదేశ్

2. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా- ఆంధ్రప్రదేశ్

3. ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (ఏఐఐపీహెచ్ఎస్) స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ- ఢిల్లీ

4. కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్- దరియాగంజ్ (ఢిల్లీ)

5. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ- ఢిల్లీ

6. వొకేషనల్ యూనివర్సిటీ- ఢిల్లీ

7. ఏడీఆర్-సెంట్రిక్ జురిడిషియల్ యూనివర్సిటీ- ఢిల్లీ

8. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్- న్యూ ఢిల్లీ

9. విశ్వకర్మ ఓపెనర్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్- ఢిల్లీ

10. ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (స్పిరిచ్యువల్ యూనివర్సిటీ)- ఢిల్లీ

11. బడాగన్వీ సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ- గోకక్ (బెల్గాం), కర్ణాటక

12. సెయింట్ జాన్స్ యూనివర్సిటీ- కిషనాట్టం (కేరళ)

13. రాజా అరబిక్ యూనివర్సిటీ- నాగపూర్ (మహారాష్ట్ర)

14. శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్-పుదుచ్చేరి

15. గాంధీ హిందీ విద్యాపీఠ్- ప్రయాగ్ (అలహాబాద్), ఉత్తరప్రదేశ్

16. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి- కాన్పూర్ (ఉత్తరప్రదేశ్)

17. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ)- అచల్తల్ (అలీగఢ్), ఉత్తరప్రదేశ్

18. భారతీయ శిక్షా పరిషత్- ఉత్తరప్రదేశ్

19. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అల్టర్నేటివ్ మెడిసిన్- కోల్ కతా

20. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్- కోల్ కతా

University Grants Commission (Photo-Wikimedia Commons)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)