Inter Exams Fee Date Extended: ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు తేదీ పొడిగింపు.. జనవరి 3 వరకు పొడగించిన ఇంటర్మీడియెట్ బోర్డు.. రూ.2500 అపరాధ రుసుము చెల్లించాలని స్పష్టం

తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్ష ఫీజు గడువు తేదీని జనవరి 3 వరకు పొడగిస్తున్నట్టు తెలిపింది.

Representative Image (Photo Credit: PTI)

Hyderabad, Dec 30: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు (Telangana Intermediate Board) కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్ష ఫీజు (Inter Exam Fee) గడువు తేదీని జనవరి 3 వరకు పొడగిస్తున్నట్టు తెలిపింది. రూ.2500 అపరాధ రుసుముతో విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చని స్పష్టం చేసింది. ఇంటర్మీడియెట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరాల జనరల్‌, ఒకేషనల్‌ విభాగాలకు చెందిన విద్యార్థులు అపరాధ రుసుముతో కలిపి ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఇంటర్‌ కోర్సుల్లో మొత్తం 10,59,233 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోగా.. ఇప్పటిదాకా 9,77,040 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారని బోర్డు తెలిపింది.

Srisailam Temple: శ్రీశైలం మల్లన్న భక్తులకు అలెర్ట్‌.. రెండు రోజులు ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు.. ఎందుకంటే??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now