COVID19 in Hyderabad: జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 355 కేసులు నమోదు, మాస్కులు ధరించని 6,500 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు

కొవిడ్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతోన్న నేప‌థ్యంలో ఎవ‌రైనా మాస్కు ధరించకపోతే రూ.1,000 జరిమానా విధించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వ ఆదేశాల‌ను పోలీసులు ప‌క్కాగా అమ‌లు చేస్తున్నారు. ఈ నెల‌ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సుమారు 6,500 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిలో అత్య‌ధిక మంది హైదరాబాద్, ప‌రిస‌ర ప్రాంతాల‌కు చెందిన వారే ఉన్నారు.

COVID19 in Hyderabad: జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 355 కేసులు నమోదు, మాస్కులు ధరించని 6,500 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు
Telangana Health Minister Etela Rajender | File Photo

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ప‌రిధిలో క‌లిపి మాస్క్‌లు ధరించని 3,500 మందిపై కేసులు నమోదు చేసిన‌ట్లు పోలీసులు చెప్పారు. మాస్కు పెట్టుకోని వారిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద జ‌రిమానా విధించ‌డ‌మే కాకుండా వారిపై కేసులు న‌మోదు చేసి, న్యాయ‌స్థానంలో హాజరు కావాలని పోలీసులు చెబుతున్నారు.

కోవిడ్ సెకండ్ వేవ్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 2,251 పాజిటివ్ కేసులు (TS Covid Update) నమోదయ్యాయి. ఇదే సమయంలో 565 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక 24 గంటల్లో ఆరుగురు కరోనాతో ప్రాణాలు (Covid Deaths) కోల్పోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 355 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసులు 3,29,529కి (COVID19 in Telangana) చేరుకోగా... 3,05,900 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 1,765 మంది మృతి చెందారు. రాష్ట్రంలో రికవరీ రేటు 92.82 శాతంగా ఉంది. దేశ రికవరీ రేటు 89.9 శాతం కావడం గమనార్హం.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Advertisement


Advertisement
Advertisement
Share Us
Advertisement