MMTS Trains Cancelled: 29 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. ఆపరేషనల్ కారణాలతో రద్దు చేసినట్లు రైల్వే వెల్లడి
ఆపరేషనల్ కారణాలతో మొత్తం 29 సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Hyderabad, Dec 24: హైదరాబాద్ లో (Hyderabad) వివిధ మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను (MMTS Trains) రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. ఆపరేషనల్ కారణాలతో మొత్తం 29 సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు సహకరించాలంటూ విజ్ఞప్తి చేసింది. సికింద్రాబాద్, లింగంపల్లి, ఉందానగర్, ఫలక్ నుమా మార్గాల్లో నడిచే మొత్తం 29 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. వీటితో పాటు రామచంద్రాపురం - ఫలక్‌నుమా, మేడ్చల్-సికింద్రాబాద్, ఫలక్‌నుమా-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి తదితర సర్వీసులను కూడా ఆపేస్తున్నట్లు వివరించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)