Vande Bharat (Photo Credits: File Image)

New Delhi, FEB 08: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ రైళ్లను (Vande Bharat Trains) ప్రవేశపెడుతున్నది. ఇప్పటికే పలుమార్గాల్లో సెమీహైస్పీడ్‌ రైళ్లు పరుగులుపెడుతున్నాయి. త్వరలోనే వందే భారత్‌ స్లీపర్‌ రైలు పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. సుదూర ప్రయాణాల్లో విప్లవాత్మక మార్పులను వందే భారత్‌ స్లీపర్‌ రైలు తీసుకువస్తుందని రైల్వేశాఖ (Railway Ministry) పేర్కొంది. రీసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ (RDSO) తొలి వందే భారత్‌ స్లీపర్‌ ముంబయి – అహ్మదాబాద్‌ మార్గంలో 540 కిలోమీటర్ల దూరం ట్రయల్‌ రన్‌ను విజయవంతంగా నిర్వహించింది. 16 కోచ్‌లతో రైలు పరుగులు తీసింది. త్వరలోనే తొలి వందే భారత్‌ స్లీపర్‌ రైలును ప్రారంభించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది.

PM Modi on BJP Victory in Delhi Assembly Elections 2025: ఢిల్లీ ప్రజల రుణం తీర్చుకుంటాం, ఇకపై ఆధునిక నగరాన్ని చూస్తారంటూ భరోసా ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ఎన్నికల్లో గెలుపై ఇంకా ఏమన్నారంటే? 

ట్రయల్‌ రన్‌కు సంబంధించిన డేటాను విశ్లేషించిన అనంతరం ఆర్‌డీఎస్‌ఓ ఫైనల్‌ ధ్రువీకరణ పత్రం జారీ చేయనున్నది. రైల్వే సేఫ్టీ కమిషనర్ రైలును గరిష్ఠ వేగాన్ని పరిశీలించనున్నారు. ఈ ఏడాది జనవరి తొలివారం రైలు కోటాలో 30-40 కిలోమీటర్ల స్వల్ప దూరంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ సమయంలో రైలు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లింది. వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు రాబోయే కాలంలో రాత్రి ప్రయాణాన్ని పునర్నిర్వహించబోతున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రోటోటైప్‌ విజయవంతమైన ట్రయల్‌ రన్‌ పూర్తి చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Viral News: సిబిల్ స్కోరు లేదు.. పెళ్లి రద్దు చేసిన అమ్మాయి కుటుంబం, మహారాష్ట్రలో ఘటన, పెళ్లి కొడుకు సిబిల్ స్కోరు తక్కువని ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్న అమ్మాయి ఫ్యామిలీ 

ఈ ఏడాది మరో తొమ్మిది వందే భారత్‌ ట్రైన్‌ సెట్స్‌ను ఉత్పత్తి చేయాలని రైల్వేశాఖ భావిస్తుంది. ఏప్రిల్‌, డిసెంబర్‌ మధ్య ఐసీఎఫ్‌ డెలివరీ చేయనున్నది. ఈ రైలులో మూడు కేటగిరిలు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఏపీ ఫస్ట్‌ క్లాస్‌, సెకండ్‌ క్లాస్‌ ఏసీ, ఏసీ త్రీ టైర్‌ అందుబాటులో ఉంటాయి. మొత్తం 1,128 బెర్తులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. గత నెలలో భారతీయ రైల్వేశాఖ 24 వందే భారత్‌ స్లీపర్‌ రైలు 50 రేకుల కోసం ఆర్డర్‌ వచ్చింది. రాబోయే రెండేళ్లలో సిద్ధమయ్యే అవకాశం ఉంది. 2026-27 సంవత్సరంలో 24 సెట్స్‌ ఉత్పత్తి కానున్నాయి. ఇది రైల్వే టెక్నాలజీలో భారత్‌ స్వావలంభనను మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.