Hyderabad, Dec 24: ఎన్నికల హామీలను (Election Promises) అమలు చేయడంపై తెలంగాణలోని (Telangana) కాంగ్రెస్ సర్కారు (Congress Government) దృష్టి సారించింది. మహాలక్ష్మి పథకంలో (Mahalakshmi Scheme) భాగంగా మహిళలకు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయగా తాజాగా రూ.500లకే గ్యాస్ పంపిణీపై కసరత్తు మొదలుపెట్టింది. గ్యాస్ సిలిండర్ పంపిణీకి అర్హులను ఎంపిక చేసే ప్రక్రియపై విధివిధానాలను పరిశీలిస్తోంది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారినే లబ్ధిదారులుగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి పౌరసరఫరాల శాఖ కీలక ప్రాతిపదనలు పంపించినట్టు సమాచారం. పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా లబ్దిదారుల బయోమెట్రిక్ ను తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ సూచించినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి సారధ్యంలో కలెక్టర్లతో ఆదివారం నిర్వహించనున్న సమీక్షలో ఈ అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)