AP SSC Time Table 2023: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఇదే, ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు, ఆరు సబ్జెక్ట్‌లకే పరీక్ష నిర్వహణ

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. 2023 ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు టెన్త్‌ బోర్డు ప్రకటించింది . ఈ మేరకు టైం టేబుల్‌ను ప్రకటించింది. ఆరు సబ్జెక్ట్‌లకే పరీక్ష నిర్వహణ ఉండనుందని బోర్డు వెల్లడించింది.

10th Class Exams Cancelled. Representational Image. |(Photo Credits: PTI)

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. 2023 ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు టెన్త్‌ బోర్డు ప్రకటించింది . ఈ మేరకు టైం టేబుల్‌ను ప్రకటించింది. ఆరు సబ్జెక్ట్‌లకే పరీక్ష నిర్వహణ ఉండనుందని బోర్డు వెల్లడించింది. అలాగే.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నాం 12.45 వరకు పరీక్షా సమయంగా నిర్ణయించారు. సిబీఎస్ఈ తరహాలో రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 3వ తేదీన ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1. ఏప్రిల్ ఆరున సెకండ్ లాంగ్వేజ్. 8వ తేదీన ఇంగ్లీష్, 10వ తేదీ లెక్కలు, 13న సైన్స్, 15న సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయి. 17వ తేదీన మొదటి ‌లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ఎస్ఇ మెయిన్ లాంగ్వేజ్‌ పేపర్ -1 నిర్వహిస్తారు. 18వ తేదీన ఓఎస్ఎస్ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష ఉండనుంది.

Here's Exam Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now