Cyclone Biparjoy: తీవ్ర తుపానుగా బలహీనపడ్డ బిపర్‌జోయ్.. గుజరాత్ తో విధ్వంసం తర్వాత రాజస్థాన్ వైపు పయనం.. తుపాను కారణంగా తండ్రీ కొడుకుల మృతి.. 23 జంతువుల మృత్యువాత.. రాజస్థాన్‌లో నేడు, రేపు భారీ వర్షాలు.. గుజరాత్‌లో అంధకారంలో 940 గ్రామాలు
తీరాన్ని తాకిన తర్వాత అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుకు మారింది. గుజరాత్‌లో విధ్వంసం సృష్టించిన తర్వాత రాజస్థాన్‌కు మళ్లింది. ఫలితంగా నేడు, రేపు రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది.
Hyderabad, June 16: నిన్న గుజరాత్ (Gujarat) తీరాన్ని తాకిన అతి తీవ్ర తుపాను బిపర్‌జోయ్ (Biparjoy) విధ్వంసం సృష్టిస్తోంది. తీరాన్ని తాకిన తర్వాత అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుకు (Severe Cyclone Biparjoy) మారింది. గుజరాత్‌లో విధ్వంసం సృష్టించిన తర్వాత రాజస్థాన్‌కు (Rajasthan) మళ్లింది. ఫలితంగా నేడు, రేపు రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. తుపానకు కారణంగా భావ్‌నగర్ జిల్లాలో చిక్కుకున్న మేకలను రక్షించే ప్రయత్నం చేసిన పశువుల యజమాని, అతడి కుమారుడు మరణించగా, మరో 22 మంది గాయపడ్డారు. 23 జంతువులు మృత్యువాత పడ్డాయి. ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తుండడంతో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 524 చెట్లు కుప్పకూలాయి. 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.