Vijayawada, Dec 24: బంగాళాఖాతంలో (Bay of Bengal) కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వల్ల ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోని కోస్తా జిల్లాలకు భారీ వర్షాల (Heavy Rains) ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తోందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో నేటి నుంచి గురువారం వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.రాష్ట్రంలోని గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, కృష్ణపట్నం, విశాఖపట్నం, మచిలీపట్నం, కళింగపట్నం సహా తమిళనాడులోని వివిధ పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
నేడు ఈ ప్రాంతాల్లో వర్షాలు
విశాఖ, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతిపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్‌టీఆర్
బుధవారం ఈ ప్రాంతాల్లో వర్షాలు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, పల్నాడు, బాపట్ల, ప్రకాశం