FASTags e-KYC Deadline: ఫాస్టాగ్ కూ ఈ-కేవైసీ.. మిగిలింది నాలుగు రోజులే.. త్వరపడండి!
ఫాస్టాగ్ డీయాక్టివేట్ కాకుండా ఉండేందుకు వినియోగదారులు ఈ-కేవైసీ వివరాలను అప్డేట్ చేయాలని సూచించింది.
Newdelhi, Jan 28: జనవరి 31 తర్వాత అసంపూర్తిగా ఈ-కేవైసీ (e-KYC) ఉన్న ఫాస్టాగ్ లను (FASTag) డీయాక్టివేట్ చేస్తామని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ-NHAI) హెచ్చరిచింది. ఫాస్టాగ్ డీయాక్టివేట్ కాకుండా ఉండేందుకు వినియోగదారులు ఈ-కేవైసీ వివరాలను అప్డేట్ చేయాలని సూచించింది. ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడానికి, టోల్ ప్లాజాల వద్ద అంతరాయం లేకుండా సేవలు అందించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు హైవే అథారిటీ పేర్కొంది.