Hyd, Jan 16: ఈడీ విచాణరకు హాజరయ్యారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గచ్చిబౌలిలోని తన నివాసం నుండి బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు కేటీఆర్. ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో అసలు ఏం జరిగింది అనే అంశాలపై ఆరా తీయనుంది ఈడీ.
వాస్తవానికి ఈడీ విచారణకు ఈ నెల 7న హాజరుకావాల్సి ఉంది కేటీఆర్. అయితే ఏసీబీ కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసిన నేపథ్యంలో 16న విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో ఈడీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్.జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ కేసులో ముగ్గురు అరెస్ట్, నిందితుల నుంచి 3 సెల్ ఫోన్లు, ఓ మోటార్ సైకిల్ స్వాధీనం
మరోవైపు మంత్రిగా తాను తీసుకున్న నిర్ణయాల్లో ఇది గొప్ప నిర్ణయమని తెలిపారు కేటీఆర్. ఫార్ములా-ఈని తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా నేను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందని ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ-మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తడం జరిగిందన్నారు.ఎన్ని రకాల చిల్లర కేసులు, బురదజల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవు అన్నారు.
KTR At ED Office
ఫార్ములా-ఈ అక్రమ కేసులో విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS. pic.twitter.com/K01L58LDKn
— BRS Party (@BRSparty) January 16, 2025
మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాదును పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తాను అన్నారు. ఫార్ములా-ఈ రేసు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపిందని... ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్, నిబద్ధత, హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలి అన్నారు.
అందుకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాను: రాష్ట్ర ప్రభుత్వం పంపిన 46 కోట్ల రూపాయల డబ్బులు ఫార్ములా-ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగింది. కేవలం బ్యాంక్ లావాదేవీగా స్పష్టమైన రికార్డు ఉందన్నారు. ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు, ప్రతి నయా పైసాకు లెక్క ఉందన్నారు కేటీఆర్.
KTR On Formula E Race Case
Hosting Formula E in India/Telangana/Hyderabad remains one of my most cherished decisions as a Minister. The pride I felt, witnessing international racers & E-Mobility industry leaders praise our city, is memorable
No amount of frivolous cases, cheap mudslinging, or political…
— KTR (@KTRBRS) January 16, 2025
మరి అలాంటి సమయంలో ఇందులో అవినీతి, మనీలాండరింగ్ ఎక్కడ ఉంది?, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లనే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులు విచారణల పేరుతో ఈ అంశాన్ని లాగుతుందని... కచ్చితంగా ఈ అంశంలో నిజమే గెలుస్తుంది... ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు, కోర్టులు కూడా త్వరలో తెలుసుకుంటాయని.. అప్పటిదాకా న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తేల్చిచెప్పారు కేటీఆర్.