Formula-E Race Case ACB Issues Notices to ACE NextGen(X)

ఫార్ములా - ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ACE NextGen కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. గ్రీన్ కో ఎండీ అనిల్ కు సైతం ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 18న విచారణకు హాజరుకావాలని నోటీసులోపేర్కొంది ఏసీబీ. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, BLN రెడ్డి లను విచారించారు ఏసీబీ అధికారులు.

ఇక ఇదే కేసులో ఇవాళ ఈడీ విచాణరకు హాజరయ్యారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గచ్చిబౌలిలోని తన నివాసం నుండి బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు కేటీఆర్.   ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో అసలు ఏం జరిగింది అనే అంశాలపై ఆరా తీయనుంది ఈడీ.వాస్తవానికి ఈడీ విచారణకు ఈ నెల 7న హాజరుకావాల్సి ఉంది కేటీఆర్.

Formula-E Race Case: ACB Issues Notices to ACE NextGen

అయితే ఏసీబీ కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసిన నేపథ్యంలో 16న విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో ఈడీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్