Delhi, Feb 7: రైతులకు శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధుల విడుదలకు సంబంధించి తేది ఖరారైంది(PM Kisan 19th Installment Date). ఈ పథకం ద్వారా రైతులకు డైరెక్ట్‌గా వారి బ్యాంకు ఖాతాల్లో ₹2,000 అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అర్హత కలిగిన లబ్ధిదారులకు ఏటా మూడు వాయిదాలలో మొత్తం ₹6,000 అందిస్తుంది. చివరగా గతేడాది అక్టోబర్‌లో రిలీజ్ చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ఈనెల 24వ తేదీన బిహార్‌లో పర్యటించనున్నారు. బిహార్ పర్యటనలో 19వ పీఎం కిసాన్ డబ్బులను రిలీజ్ చేయనున్నారు. రైతుల ఖాతాల్లోకి రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయం విడుదల చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లు తెలుస్తోంది.
()రైతులు తప్పనిసరిగా భారతీయులై ఉండాలి నివాసితులుగా ఉండాలి.
()5 ఎకరాల కంటే తక్కువ భూమిని కలిగి ఉన్న రైతులు ఇందుకు అర్హులు
()సన్న, చిన్న రైతులు మాత్రమే అర్హులు.
()భర్త, భార్య మరియు వారి అవివాహిత పిల్లలపై ఆధారపడిన రైతు కుటుంబంలోని ఒక సభ్యుడు మాత్రమే PM యొక్క 19వ విడత పొందేందుకు అర్హులు.
కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు,నిపుణులు (రిజిస్టర్డ్ వైద్యులు, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు న్యాయవాదులు, గత అసెస్‌మెంట్ సంవత్సరంలో పన్నులు చెల్లించిన పన్ను చెల్లింపుదారులు, నెలవారీ పెన్షన్ ₹10,000 లేదా అంతకంటే ఎక్కువ అందుకుంటున్న వారు, రాజ్యాంగ పదవులు కలిగిన రైతులకు ఈ పథకం వర్తించదు. రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. 10-21వ తేదీల మధ్య 30 రైళ్లు రద్దు.. కారణం ఏమిటంటే??
అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/లోకి వెళ్లి లబ్దిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రం, జిల్లా, మండలం,గ్రామం వంటి వివరాలను అందించాల్సి ఉంటుంది.
పీఎం కిసాన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?
ముందుగా అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inలోకి వెళ్లాలి
స్కీన్‌పై కనిపించే ఆప్షన్లలో స్టేటస్ లింక్ పై క్లిక్ చేయాలి.
మీకు అక్కడ రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. మీ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ ఐడీ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు అందించి గేట్ డేటాపై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత లబ్ధిదారుల వివరాలు కనిపిస్తాయి.