Trains Cancelled: విజయనగరం జిల్లా రైలు ప్రమాదం నేపథ్యంలో నేడు కూడా పలు రైలు సర్వీసుల రద్దు.. వివరాలు ఇవిగో!

విజయనగరం జిల్లా రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రద్దు చేశామని అధికారులు ప్రకటించారు.

Representational (Credits: Facebook)

Vijayawada, Oct 31: విజయనగరం జిల్లా రైలు ప్రమాదం (Vizianagaram Train Accident) నేపథ్యంలో పలు రైలు సర్వీసులను (Train Services) రద్దు (Cancel) చేశామని అధికారులు ప్రకటించారు. హవ్‌ డా-సికింద్రాబాద్ (12703) ఫలక్‌ నుమా ఎక్స్‌ ప్రెస్, హవ్‌ డా-బెంగళూరు (12245) దురంతో ఎక్స్‌ప్రెస్, షాలీమార్-హైదరాబాద్ (18045) ఈ కోస్ట్‌ ఎక్స్‌ ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. తిరుపతి-పూరి (17480) ఎక్స్‌ ప్రెస్, పలాస్-విశాఖ (08531) ప్యాసింజర్, తిరుపతి-విశాఖ (08584) ప్రత్యేక రైలు, విశాఖ-గుణుపూర్ (17240) ఎక్స్‌ ప్రెస్‌ లనూ రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. భువనేశ్వర్-కేఎస్‌ఆర్ బెంగళూరు (18463) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ నూ రీషెడ్యూల్ చేశారు. నేడు ఉదయం 5.40 గంటలకు బయలుదేరాల్సిన రైలు 10 గంటలకు వెళుతుందని చెప్పారు. రైలు ప్రమాదం నేపథ్యంలో నిన్న కూడా రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.

Afg vs SL, World Cup 2023: పఠాన్ల సంచలనం, శ్రీలంకను ఓడించి ప్రపంచకప్‌లో దుమారం సృష్టించిన ఆఫ్ఘనిస్థాన్

Representational (Credits: Facebook)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now