Special Trains For Summer: వేసవి కోసం రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు.. 380 ప్రత్యేక రైళ్లు సిద్ధం.. దేశంలోని ప్రధాన కేంద్రాల మీదుగా 6,369 ట్రిప్పుల నిర్వహణకు నిర్ణయం
వేసవిలో ప్రయాణాలు, టూర్స్, ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ ఎప్పటిలాగే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది. మొత్తం 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Newdelhi, May 20: వేసవిలో ప్రయాణాలు (Summer Trips), టూర్స్ (Tours), ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ (Railway) ఎప్పటిలాగే ప్రత్యేక రైళ్లను (Special Trains) నడిపేందుకు నిర్ణయించింది. మొత్తం 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ (Railway Ministry) పేర్కొంది. పాట్నా, ఢిల్లీ, విశాఖపట్నం, ముంబై వంటి ప్రధాన కేంద్రాల మీదుగా మొత్తం 6,369 రైళ్ల ట్రిప్పులు నిర్వహించేందుకు నిర్ణయించింది. రైల్వే శాఖ గతేడాది 348 ప్రత్యేక రైళ్లతో ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 4,599 ట్రిప్పులను నిర్వహించింది. ఈ ఏడాది అదనంగా మరో 1,770 ట్రిప్పులను జోడించింది. ఈ ప్రత్యేక సర్వీసులు పాట్నా-యశ్వంత్‌పూర్, పాట్నా-సికింద్రాబాద్, విశాఖపట్నం-పూరీ-హావ్డా తదితర మార్గాల్లో నడపనున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)