Toor Dal (Credits: Twitter)

Newdelhi, May 20: పెట్రోల్ (Petrol), గ్యాస్ (Gas) ధరలతో ఇప్పటికే కుదేలైన సామాన్యులను.. ఇప్పుడు కందిపప్పు ధరలు భయపెడుతున్నాయి. డిమాండ్‌కు (Demand) సరిపడా కందిపప్పు (Toor Dal) అందుబాటులో లేకపోవడంతో దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్లు (Super Markets) సహా కిరాణా దుకాణాల్లోనూ నోస్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. డిమాండ్ పెరుగడంతో రిటైల్ మార్కెట్లో ప్రస్తుతం రూ. 140కి పెరిగిన ధర రూ.180 వరకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. వేసవిలో కందిపప్పు వినియోగం కొంత తక్కువగా ఉంటుందని, వచ్చేది వర్షాకాలం కావడంతో పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

World's Most Expensive Ice Cream: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ ఇది.. దీని స్పెషాలిటీ ఏంటి మరి??

కొరతకు కారణం ఏంటంటే?

గతేడాది దేశంలో 43.4 లక్షల టన్నుల కందిపప్పును పండించగా, మరో 15 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నారు. అయితే, ఈ ఏడాది మాత్రం దిగుబడి 38.9 లక్షల దాటలేదు. దీనికి తోడు దిగుమతి విషయంలోనూ కేంద్రం అలసత్వం చేసిందన్న ఆరోపణలున్నాయి. అకాల వర్షాలు కూడా కందిపప్పు కొరతకు కారణంగా చెబుతున్నారు.

Bandla Ganesh on Devara: ఎన్టీఆర్, కొరటాల కాంబోలో కొత్త చిత్రం 'దేవర' టైటిల్ తనదేనని.. టైటిల్ ని కొట్టేశారంటున్న బండ్ల గణేశ్