Visa Free Entry: వీసా లేకుండానే భారతీయ పర్యాటకులకు మలేసియా ఎంట్రీ.. డిసెంబర్ 1 నుంచి మొదలుకానున్న ఆఫర్.. 30 రోజులపాటు అక్కడ గడిపేందుకు ఛాన్స్
భారతీయులకు మలేషియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారతీయులు ఇకపై వీసా లేకుండానే ఆ దేశానికి వెళ్లొచ్చు.
Newdelhi, Nov 27: భారతీయులకు (Indians) మలేషియా ప్రభుత్వం (Malaysian Government) శుభవార్త చెప్పింది. భారతీయులు ఇకపై వీసా (Visa) లేకుండానే ఆ దేశానికి వెళ్లొచ్చు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని, వీసా లేకుండా 30 రోజుల పాటు తమ దేశంలో ఉండొచ్చని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆదివారం వెల్లడించారు. ఈ అవకాశాన్ని భారతీయులతో పాటు చైనా దేశస్తులకు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిచేందుకు మలేషియా ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)