Polluted Cities: కాలుష్య భారతం.. ప్రపంచంలోని వంద కాలుష్య నగరాల్లో 65 మనదేశంలోనివే.. స్విట్జర్లాండ్ సంస్థ నివేదికలో షాకింగ్ విషయాలు
ప్రపంచంలోని 100 అత్యధిక కాలుష్య నగరాల్లో 65 నగరాలు భారత్‌లోనే ఉన్నాయి.
Newdelhi, June 9: అత్యధిక కాలుష్యానికి (Pollution) కారణమవుతున్న దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా భారత్ (India) ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 100 అత్యధిక కాలుష్య నగరాల్లో (Polluted Cities) 65 నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. ఈ మేరకు స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ‘ఐక్యూఎయిర్’ ప్రపంచ వాయు నాణ్యత నివేదిక – 2022ను విడుదల చేసింది. ఈ జాబితాలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. భారత్ లో అత్యధిక కాలుష్య నగరాలన్నీ ఉత్తర భారత్ లోనివే కావడం గమనార్హం. దేశంలోనే అత్యంత కలుషిత ప్రాంతంగా మహారాష్ట్రలోని భీవండి నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ నాలుగో స్థానంలో నిలిచింది. అంతేకాదు అత్యంత కలుషిత దేశ రాజధానుల్లో ఢిల్లీ రెండో స్థానంలో నిలవడం శోచనీయం. ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య ప్రాంతాల్లో 14 ప్రాంతాలు భారత్ లోనే ఉన్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)