Makar Sankranti 2024: ఊరెళ్లే ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త, సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు, అదనపు కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన

రద్దీ నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో నాలుగు రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

Trainman App New Feature

సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను తెలిపింది. రద్దీ నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో నాలుగు రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు సికింద్రాబాద్‌, నర్సాపూర్‌, శ్రీకాకుళం మధ్య జనవరి 12, 13, 14 తేదీల్లో సర్వీసులందించనున్నాయి. ఈ రైళ్లలో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, సాధారణ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ వేదికగా తెలిపింది. అలాగే సంక్రాంతి రద్దీ దృష్ట్యా కొన్ని రైళ్లలో తాత్కాలికంగా అదనపు కోచ్‌లను ఏర్పాటు చేశారు.

ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవిగో,,

హైదరాబాద్‌ - శ్రీకాకుళం రోడ్‌ ప్రత్యేక రైలు (07178) జనవరి 12న రాత్రి 9.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11.45గంటలకు శ్రీకాకుళం చేరుకోనుంది.

శ్రీకాకుళం రోడ్‌ - హైదరాబాద్‌ ప్రత్యేక రైలు (07179) జనవరి 13న శ్రీకాకుళంలో సాయంత్రం 5.30గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు హైదరాబాద్‌కు రానుంది.

సికింద్రాబాద్‌ - నర్సాపూర్‌ ప్రత్యేక రైలు (07176) జనవరి 13న రాత్రి 10.05గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10గంటలకు నర్సాపూర్‌ చేరుకోనుంది.

నర్సాపూర్‌ - సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07177) జనవరి 14న సాయంత్రం 6గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.50గంటలకు హైదరాబాద్‌ చేరుకోనుంది.

Heres' Tweet