TSGENCO Exam Postponed: అభ్యర్థులకు అలర్ట్, తెలంగాణ జెన్‌కో రాత పరీక్ష వాయిదా, తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహించాలనే దానిపై జెన్‌కో అప్‌డేట్ ఇదిగో..

తెలంగాణ జెన్‌కో రాత పరీక్షను వాయిదా వేస్తూ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన వెలువడింది. ఈ నెల 17వ తేదీన పరీక్ష జరగాల్సి ఉండగా.. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేసినట్లు మంగళవారం సదరు ప్రకటనలో జెన్‌కో తెలిపింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, కెమిస్ట్‌ పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది అక్టోబర్‌ 4వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసింది.

TSGENCO (File Image)

ఈ నెల 17వ తేదీన రాత పరీక్ష నిర్వహించాలనుకుంది. అయితే అదే రోజు మరికొన్ని పరీక్షలు ఉన్నాయి. దీంతో పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి జెన్‌కోకు విజ్ఞప్తులు వచ్చాయి. అదే సమయంలో తాజాగా కొందరు అభ్యర్థులు డిప్యూటీ సీఎం భట్టి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లారు. దీంతో పరీక్ష వాయిదా వేసేందుకే జెన్‌కో మొగ్గు చూపింది. అయితే తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహించేది స్పష్టత ఇవ్వలేదు.జెన్‌కో వెబ్‌సైట్‌లో షెడ్యూల్‌ను పెడతామని పేర్కొంది.

Telangana Genco Exam postponed Here's Updates

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now