Tirumala: తిరుమల కొండపై మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ.. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. భక్తులతో నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్
తొలి ఏకాదశి కావడం, వీకెండ్ కూడా రావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది.
Tirumala, July 1: గత కొన్నిరోజులుగా తిరుమలలో (Tirumala) తక్కువగా నమోదైన భక్తుల (Devotees) తాకిడి ఇప్పుడు మళ్ళీ పెరిగింది. తొలి ఏకాదశి కావడం, వీకెండ్ (Weekend) కూడా రావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. టోకెన్లు (Tokens) లేకుండా క్యూలైన్లలోకి వచ్చిన భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లు అన్ని నిండిపోయి, భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో ఉన్నారు. నిన్న తిరుమల వెంకన్నను 62,005 మంది భక్తులు దర్శించుకోగా, 34,127 మంది తలనీలాల మొక్కు తీర్చుకున్నారు. నిన్న ఒక్క రోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.3.75 కోట్ల ఆదాయం వచ్చింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)