bandi Sanjay (Photo-Twitter)

Hyderabad, July 1: తెలంగాణ బీజేపీలో (Telangana BJP) భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తుండటం తెలిసిందే. ఈక్రమంలో బండి సంజయ్‌ను (Bandi Sanjay) అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారంటూ ఇప్పటివరకూ జరుగుతున్న ప్రచారం ఇప్పుడు నిజమయ్యేలానే కనిపిస్తోంది. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి, సీనియర్ నేత జి.కిషన్‌రెడ్డికి (G. Kishanreddy) అదనంగా పార్టీ పగ్గాలు అప్పగిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఒకవేళ ఇదే నిజమైతే, బండి సంజయ్ పరిస్థితి ఏంటని అందరూ అనుకుంటున్నారు. దానికి కూడా ఏర్పట్లు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం అధ్యక్ష పదవిలో ఉన్న బండి సంజయ్‌కు కేంద్రమంత్రి వర్గంలో లేదంటే పార్టీ జాతీయ నాయకత్వంలో బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మూడు నాలుగు రోజుల్లోనే అధిష్ఠానం నుంచి ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.

Group-4 Exam Today: గ్రూప్‌-4 పరీక్ష నేడే.. 15 నిమిషాల ముందే గేట్లు బంద్‌.. ఈ జాగ్రత్తలు మరిచిపోకండి!

ఇప్పుడే ఎందుకు??

రాష్ట్రంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించడమే మేలని అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. బండి సంజయ్ హయాంలో తెలంగాణలో బీజేపీకి కావాల్సినంత హైప్ వచ్చింది. పలు ఎన్నికల్లో అధికారపార్టీకి ముచ్చెమటలు పట్టించింది. ఈ నేపథ్యంలో ఆయనకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని పార్టీ నిర్ణయించింది. అలాగే, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కూడా పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

Maharashtra Accident: మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం.. మంటలు చెలరేగి 25 మంది సజీవ దహనం.. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఘటన.. గాయపడిన 8 మంది పరిస్థితి కూడా విషమం