Quality Standards for Chargers: ల్యాప్ టాప్, నోట్ బుక్, మొబైల్ ఇలా అన్ని ఎలక్ట్రానిక్ డివైస్ లకు సౌకర్యవంతంగా కనెక్ట్ అయ్యేలా ఒకే యూనివర్సల్ చార్జర్.. కేంద్రం కొత్త నిబంధనలు
మూడు రకాల ఎలక్ట్రానిక్ డివైస్ ల కోసం ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సోమవారం క్వాలిటీ స్టాండర్డ్స్ పేరిట కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. డిజిటల్ టెలివిజన్ రిసీవర్స్, యూఎస్బీ టైప్-సీ చార్జర్లు, వీడియో సర్వైలేన్స్ సిస్టం (వీఎస్ఎస్)కు ఈ నియమాలు వర్తిస్తాయని పేర్కొంది.
Newdelhi, Jan 10: మూడు రకాల ఎలక్ట్రానిక్ డివైస్ (Electronic Devices) ల కోసం ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్-BIS) సోమవారం క్వాలిటీ స్టాండర్డ్స్ (Quality Standards) పేరిట కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. డిజిటల్ టెలివిజన్ రిసీవర్స్ (Digital TV Receivers) , యూఎస్బీ టైప్-సీ చార్జర్లు (C-Chargers), వీడియో సర్వైలేన్స్ సిస్టం (వీఎస్ఎస్-VSS)కు ఈ నియమాలు వర్తిస్తాయని పేర్కొంది.
సెట్ టాప్ బాక్స్ లేకపోయినా దూరదర్శన్ వంటి చానళ్ళు టీవీల్లో ప్రసారంఅయ్యేలా చర్యలు, ల్యాప్ టాప్, నోట్ బుక్, మొబైల్ ఇలా అన్ని ఎలక్ట్రానిక్ డివైస్ లకు సౌకర్యవంతంగా కనెక్ట్ అయ్యేలా ఒక యూనివర్సల్ చార్జర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా వీఎస్ఎస్ ను తీసుకురావడం తదితర అంశాలు ఇందులో ఉన్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)