భారతీ ఎయిర్‌టెల్ వైజాగ్‌లో అత్యాధునిక 5జీ ప్లస్ సేవలను గురువారం నుంచి ప్రారంభించినట్లు ప్రకటించింది. సంస్థ తన 5జీ నెట్‌వర్క్‌ని దశలవారీగా విశాఖ నగరంలోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎయిర్‌టెల్ ఏపీ, తెలంగాణ సీఈవో శివన్ భార్గవ వెల్లడించారు.5జీ నెట్‌వర్క్‌ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేంత వరకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా హై స్పీడ్ ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ నెట్‌వర్క్‌ని ఉచితంగా పొందవచ్చని సీఈవో శివన్ వివరించారు. ప్రస్తుతం ఉన్న 4జీ నెట్‌వర్క్ సిమ్‌తోనే 5జీ సేవల్ని 5జీ ఫోన్‌లో పొందేలా వినియోగదారులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.
Here's Update
#Airtel5GPlus is now in Vizag! https://t.co/d1gRMZHMU7
— BGR.in (@BGRIndia) December 22, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)