భారత టెలికాం నియంత్రణ సంస్థ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) Reliance Jio, Bharti Airtel‌కు చౌకైన రూ. 249 మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను తొలగించడం పై వివరణాత్మక సమాచారం కోరినట్లు తాజాగా సమాచారం వెల్లడి అయింది. గత కొన్ని రోజులుగా జియో 28 రోజుల చెల్లుబాటు గల రూ. 249 ప్లాన్‌ను నిలిపివేసింది. అదే విధంగా ఎయిర్‌టెల్ కూడా 24 రోజుల చెల్లుబాటు గల రూ. 249 ప్లాన్‌ను మార్కెట్ నుంచి తొలగించింది. ఈ ప్లాన్‌లు 1GB డేటాతో అత్యంత చౌకైన ఎంట్రీ-లెవల్ ఆఫర్లు కావడం వల్ల వినియోగదారులలో విపరీత ఆదరణ పొందాయి.TRAI దీనిపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. అలాగే, టెలికాం విభాగం (DoT – Department of Telecommunications) కూడా TRAIకి వివరణాత్మక నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

ఢిల్లీ, బాంబే హైకోర్టులకు బాంబు బెదిరింపు మెయిళ్లు, కోర్టు నుంచి పరుగులు పెట్టిన లాయర్లు, అర్ధాంతరంగా ఆగిపోయిన విచారణలు

ఇక ఈ ప్లాన్ Jio Store లో ఆఫ్‌లైన్ ఛానెల్స్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటున్నాయని స్పష్టం Reliance Jio తెలిపింది. భారతి ఎయిర్‌టెల్ తన రీఛార్జ్ ప్లాన్ తొలగింపు కారణంగా, అంతర్గత అంచనాలు, వినియోగదారుల విశ్లేషణలు, వ్యాపార వ్యూహాలను సూచించింది. ఈ నిర్ణయాల వల్ల ప్రధానంగా డేటా వినియోగదారులకు, చౌకైన మొబైల్ ప్లాన్‌లు అన్వేషించే యూజర్లకు ప్రభావం పడుతుంది.

Jio and Airtel Face India’s Telecom Regulator Probe Over Withdrawal of INR 249 Recharge Plans

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)