ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ విలీనమయ్యాయి. దీనికి 'జియోహాట్ స్టార్' అని పేరు పెట్టారు. ఈ మెర్జ్ తో జియోహాట్ స్టార్ అతిపెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ గా మారింది. ఇకపై యూజర్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమాలోని కంటెంట్ మొత్తం ఒకే చోట చూడవచ్చు. జియో హాట్‌స్టార్‌లో 100 లైవ్ టీవీ ఛానెల్స్, 30 గంటలకు పైగా కంటెంట్ ఉంటుంది. ఐపీఎల్ సహా ఇండియాలోని క్రికెట్ మ్యాచ్ ల డిజిటల్ హక్కులను జియో సినిమా కలిగి ఉంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్ అన్ని ఐసీసీ టోర్నమెంట్ ల హక్కులను కలిగి ఉంది. అయితే, ఇకపై అన్ని మ్యాచ్ లను జియో హాట్‌స్టార్ లో చూడవచ్చు.
జియోహాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఇలా..
మొబైల్
రూ. 149/ 3 నెలలు, రూ. 499/ ఏడాది. అయితే ఈ ప్లాన్ ద్వారా కేవలం ఒక మొబైల్ లో మాత్రమే కంటెంట్ చూసే వెసులుబాటు ఉంటుంది.
సూపర్ ప్లాన్
రూ. 299/ 3 నెలలు, రూ. 899/ ఏడాది. ఈ ప్లాన్ ద్వారా రెండు డివైజ్‌లకు సపోర్ట్ ఉంటుంది.
ప్రీమియం ప్లాన్
రూ. 499/ 3నెలలు, రూ. 1,499/ ఏడాది. ప్రకటనలు లేకుండా కంటెంట్ వీక్షించాలనుకునే వినియోగదారుల కోసం జియోహాట్ స్టార్ ఈ ప్రీమియర్ ప్లాన్లను తీసుకువచ్చింది.
JioHotstar Subscription Plans:
Disney+ Hostar & JioCinema have finally merged into JioHotstar.
Hostar app has been converted to the new service. Here are the subscription costs per plan ⬇️
Mobile:
₹149/3mo.
₹499/yr.
Super:
₹299/3mo.
₹899/yr.
Premium Ad-Free:
₹499/3mo.
₹1,499/yr.
Existing subscribers… pic.twitter.com/YfTYLIKSF1
— Ishan Agarwal (@ishanagarwal24) February 14, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)