Aadhaar-Voter ID Linking: ఆధార్ తో ఓటర్ ఐడీ లింక్ కాకపోయినా.. జాబితా నుంచి ఓటర్ల పేర్లు తీసివేయబోం.. పార్లమెంట్ లో కేంద్రం
ఓటరు కార్డుతో ఆధార్‌ను అనుసంధానించే అంశంపై కేంద్రం మరోసారి పార్లమెంట్‌లో వివరణ ఇచ్చింది. ఇది పూర్తిగా పౌరుల స్వచ్ఛందపరమైన అంశమని, ఇది ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయమని పేర్కొంది.
Newdelhi, Dec 17: ఓటరు కార్డుతో (Voter Card) ఆధార్‌ను (Aadhaar) అనుసంధానించే అంశంపై కేంద్రం మరోసారి పార్లమెంట్‌లో (Parliament) వివరణ ఇచ్చింది. ఇది పూర్తిగా పౌరుల స్వచ్ఛందపరమైన అంశమని, ఇది ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయమని పేర్కొంది. ఎవరైనా తన ఆధార్‌ను లింక్ చేయకపోయినా, ఓటరు కార్డు నుండి వారి పేరు తొలగించబోమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) అన్నారు.
ఈ మేరకు శుక్రవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)