Jammu and Kashmir: జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదుల కాల్పులు, ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చిన భారత ఆర్మీ, కాల్పుల్లో అమరుడైన జవాన్

జ‌మ్మూక‌శ్మీర్‌లోని సుంజ్వాన్ ఏరియాలో ఉగ్ర‌వాదులు త‌ల‌దాచుకున్న‌ట్లు భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు స‌మాచారం అందింది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో ఉగ్ర‌వాదులు ఉన్న‌ట్లు సైన్యం గుర్తించింది. ఉగ్ర‌వాదుల కోసం గురువారం రాత్రి అక్క‌డ బ‌ల‌గాలు కూంబింగ్ ప్రారంభించాయి.

Indian security forces near Line of Control in Jammu and Kashmir (Photo Credits: IANS)

జ‌మ్మూక‌శ్మీర్‌లోని సుంజ్వాన్ ఏరియాలో ఉగ్ర‌వాదులు త‌ల‌దాచుకున్న‌ట్లు భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు స‌మాచారం అందింది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో ఉగ్ర‌వాదులు ఉన్న‌ట్లు సైన్యం గుర్తించింది. ఉగ్ర‌వాదుల కోసం గురువారం రాత్రి అక్క‌డ బ‌ల‌గాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ క్ర‌మంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌పై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. దీంతో ఓ జ‌వాను ప్రాణాలు కోల్పోగా, మ‌రో న‌లుగురు జ‌వాన్లు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు జ‌మ్మూ జోన్ ఏడీజీపీ ముఖేష్ సింగ్ పేర్కొన్నారు. ఉగ్ర‌వాదుల కోసం కూంబింగ్ కొన‌సాగుతోంద‌ని సింగ్ తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు భద్రతా బలగాలు తెలిపాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement