COVID Cases Rise in India: చలికాలంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, గత 24 గంటల్లో 166 కొత్త కేసులు, సిమ్లాలో మహిళ మృతి, అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం

ఇండియాలో మళ్లీ పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 166 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కవ భాగం కేరళలో వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 895కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

ఇండియాలో మళ్లీ పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 166 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కవ భాగం కేరళలో వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 895కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. చలికాలం కావడంతో ఇన్ ఫ్లూయెంజా వంటి వైరస్ ల కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం చెపుతోంది. మరోవైపు సిమ్లాలోని ఓ ఆసుపత్రిలో ఓ మహిళ కరోనా కారణంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రజలంతా తగు జాగ్రత్త చర్యలను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. యూకేను క‌ల‌వ‌ర‌పెడుతున్న కొత్త మ‌హ‌మ్మారి, ద‌గ్గుతో డేంజ‌ర్ లో ప‌డుతున్న ప్ర‌జ‌లు, 100 రోజుల ద‌గ్గుతో జాగ్ర‌త్త అంటూ హెచ్చ‌రిస్తున్న ఆరోగ్య నిపుణులు

Here's News

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement