Ratan Tata: రతన్ టాటా లాస్ట్ ట్వీట్ ఇదే..నా గురించి ఆలోచిస్తున్న మీకు ధన్యవాదాలు అంటూ..

ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రిలో రాత్రి 11.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా ఆయన ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి.

Ratan Tata Last tweet goes viral(X)

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రిలో రాత్రి 11.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా ఆయన ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి.

ఈ నేపథ్యంలో అక్టోబర్ 7న ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు రతన్ టాటా. నా గురించి ఆలోచిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు...నా ఆరోగ్యానికి సంబంధించి ఇటీవల పుకార్లు వ్యాపిస్తున్నాయని నాకు తెలుసు. ఇవన్నీ నిరాధారమైనవని మీకు చెప్పాలనుకుంటున్నాను. నా వయసు సంబంధిత ఆరోగ్య పరిస్థితుల కారణంగా ప్రస్తుతం నేను వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను అని తెలిపారు.  కానీ రెండు రోజుల వ్యవధిలోనే కన్నుమూశారు రతన్.మెగా ఐకాన్‌...దిగ్గజ వ్యాపారవేత్త రతన్‌టాటా మృతిపట్ల ప్రముఖుల సంతాపం.. దేశానికి ఎనలేని కృషి చేశారంటూ కితాబు

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)