Punjab: జిమ్‌లోకి వెళ్లి ఆప్ కౌన్సిలర్‌ని తుఫాకీతో కాల్చిన దుండగుడు, శరీరంలోకి బుల్లెట్ దిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన మహమ్మద్ అక్బర్

పంజాబ్‌లో ఆప్ మున్సిపల్ కౌన్సిలర్‌ మహమ్మద్ అక్బర్ దారుణ హత్యకు గురయ్యాడు. మాలెర్‌కోట్ల జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అక్బర్ జిమ్‌లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి అతడ్ని అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చినట్లు పోలీసులు తెలిపారు.

Representative Image.

పంజాబ్‌లో ఆప్ మున్సిపల్ కౌన్సిలర్‌ మహమ్మద్ అక్బర్ దారుణ హత్యకు గురయ్యాడు. మాలెర్‌కోట్ల జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అక్బర్ జిమ్‌లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి అతడ్ని అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతని శరీరంలోకి బుల్లెట్ దిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.జిమ్‌లోకి ఓ వ్యక్తి వచ్చినట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. అక్బర్ అతని దగ్గరకు వెళ్లాడు. అప్పుడు నిందితుడు వెంటనే తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ హత్యతో ఇద్దరికి సంబంధం ఉందని సీసీటీవీ ఆధారంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement