Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రోడ్డు పక్కన నడుస్తున్న వారిపైకి దూసుకొచ్చిన ఎస్‌యూవీ కారు, ముగ్గురికి గాయాలు

బుధవారం జరిగిన షాకింగ్ సంఘటనలో, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని పాల్ రోడ్‌లో వేగంగా వచ్చిన ఎస్‌యూవీ ఢీకొనడంతో ముగ్గురు పాదచారులు గాయపడ్డారు. సీసీటీవీలో రికార్డైన ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతుండగా ఇద్దరు పురుషులు, ఓ మహిళను ఎస్‌యూవీ ఢీకొట్టింది.

Speeding Car Rams Into Pedestrians in Rajasthan

బుధవారం జరిగిన షాకింగ్ సంఘటనలో, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని పాల్ రోడ్‌లో వేగంగా వచ్చిన ఎస్‌యూవీ ఢీకొనడంతో ముగ్గురు పాదచారులు గాయపడ్డారు. సీసీటీవీలో రికార్డైన ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతుండగా ఇద్దరు పురుషులు, ఓ మహిళను ఎస్‌యూవీ ఢీకొట్టింది. ఢీకొన్న తర్వాత డ్రైవర్ బ్రేకులు వేయడంతో వాహనం బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. బాధితుల్లో ఇద్దరిని చికిత్స కోసం చేర్పించారు, మూడవ వ్యక్తికి స్వల్పగాయాలు అయ్యాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న డ్రైవర్ ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement