Agnipath Protests: మిన్నంటిన ‘అగ్నిపథ్’ ఆందోళనలు, బీహార్ డిప్యూటీ సీఎం రేణూ దేవి ఇంటిని అటాక్ చేసిన ఆందోళన కారులు, దేశ వ్యాప్తంగా ఎగసిపడుతున్న ఆందోళనలు
అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తున్న యువత.. బీహార్ డిప్యూటీ సీఎం రేణూ దేవి ఇంటిపై ఇవాళ దాడికి పాల్పడ్డారు. బేటియాలో ఉన్న మంత్రి ఇంటిపై ఆందోళనకారులు అటాక్ చేశారు. గత రెండు రోజుల నుంచి బీహార్‌లో అగ్నిపథ్‌కు వ్యతిరేకింగా అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తున్న యువత.. బీహార్ డిప్యూటీ సీఎం రేణూ దేవి ఇంటిపై ఇవాళ దాడికి పాల్పడ్డారు. బేటియాలో ఉన్న మంత్రి ఇంటిపై ఆందోళనకారులు అటాక్ చేశారు. గత రెండు రోజుల నుంచి బీహార్‌లో అగ్నిపథ్‌కు వ్యతిరేకింగా అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. బేటియాలో ఉన్న తమ ఇంటిపై దాడి జరిగిందని, తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నట్లు మంత్రి రేణూ దేవి కుమారుడు మీడియాతో తెలిపారు. అయితే మంత్రి పాట్నాలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇక బీహార్‌లోని హాజీపూర్ రైల్వే స్టేషన్‌లోనూ ఇవాళ ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. అయితే నిరసనకారుల్ని పోలీసులు తరిమారు. ప్రస్థుతం పరిస్థితి అదుపులో ఉందని, ఆందోళనకారుల్ని తరిమేశామని, కొందర్ని అదుపులోకి తీసుకున్న హాజీపూర్ ఎస్పీ మనీశ్ తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)