Agnipath: వెనక్కి తగ్గేది లేదన్న కేంద్రం, త్వరలోనే అగ్నిపథ్ నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపిన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్, ఎంపికైన వారిని అగ్ని వీరులుగా గుర్తిస్తామని ప్రకటన
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం విషయంలో ముందుకే వెళ్తామని స్పష్టం చేశారు.
అగ్నిపథ్ పథకం(Agnipath Scheme)పై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్న వేళ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్(Rajnath Singh) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం విషయంలో ముందుకే వెళ్తామని స్పష్టం చేశారు. రక్షణ దళాల్లో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్న యువతకు అగ్నిపథ్ పథకం ఒక ‘సువర్ణావకాశం’ అని ఆయన వ్యాఖ్యానించారు. అగ్నిపథ్ పాలసీ కింద ఎంపికైనవారిని ‘అగ్ని వీరులు’గా గుర్తిస్తామని, నాలుగేళ్లపాటు సాయుధ బలగాల్లో వారు పనిచేయవచ్చునని సూచించారు. త్వరలోనే అగ్నిపథ్ నియామక ప్రక్రియ ఆరంభమవుతుందని తేల్చిచెప్పారు. ఇందుకు అనుగుణంగా సన్నద్ధమవ్వాలని యువతకు రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. గత రెండేళ్లలో నియామకాలు చేపట్టనందున సైన్యంలో చేరాలనుకునేవారికి ఇది చక్కటి అవకాశమని రాజ్‌నాథ్ అన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)