Agnipath Scheme: జూన్ 24వ తేదీ నుంచి అగ్నిప‌థ్ స్కీమ్ కింద కొత్త రిక్రూట్మెంట్ ప్రారంభం, తొలి దశలో వైమానిక ద‌ళంలో నియామ‌క ప్ర‌క్రియ మొద‌లు కానున్న‌ట్లు తెలిపిన ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ వీఆర్ చౌద‌రీ

జూన్ 24వ తేదీ నుంచి వైమానిక ద‌ళంలో నియామ‌క ప్ర‌క్రియ మొద‌లు కానున్న‌ట్లు ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ వీఆర్ చౌద‌రీ వెల్ల‌డించారు. అగ్నిప‌థ్ స్కీమ్‌లో భాగంగా ఏజ్ లిమిట్‌ను 23 ఏళ్ల‌కు పెంచ‌డాన్ని ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ స్వాగ‌తిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

Air Chief Marshal VR Chaudhari (Photo-ANI)

అగ్నిప‌థ్ స్కీమ్ కింద కొత్త రిక్రూట్మెంట్ స్టార్ట్ కానున్న‌ది. జూన్ 24వ తేదీ నుంచి వైమానిక ద‌ళంలో నియామ‌క ప్ర‌క్రియ మొద‌లు కానున్న‌ట్లు ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ వీఆర్ చౌద‌రీ వెల్ల‌డించారు. అగ్నిప‌థ్ స్కీమ్‌లో భాగంగా ఏజ్ లిమిట్‌ను 23 ఏళ్ల‌కు పెంచ‌డాన్ని ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ స్వాగ‌తిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. వ‌యోప‌రిమితిని పెంచ‌డం వ‌ల్ల అది యువ‌త‌కు దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆయ‌న అన్నారు. ఐఏఎఫ్ కూడా త‌న ట్విట్ట‌ర్‌లో కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించింది. అగ్నివీరుల్ని రిక్రూట్ చేసుకునేందుకు ఐఏఎఫ్ ఉత్సుక‌త‌తో ఉన్న‌ట్లు ఆ ట్వీట్‌లో తెలిపారు. మ‌రో వైపు దేశ‌వ్యాప్తంగా యువ‌త అగ్నిప‌థ్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ పెను విధ్వంసానికి పాల్ప‌డుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)