Ajay Ratra: బీసీసీఐ కొత్త సెలెక్ట‌ర్‌గా అజ‌య్ రాత్రా, స‌లీల్ అంకోలా స్థానాన్ని భర్తీ చేయనున్న అజయ్, కీలక విషయాన్ని వెల్లడించిన బీసీసీఐ

ప్ర‌స్తుతం సెలెక్ట‌న్ ప్యానెల్ స‌భ్యుల్లో ఒక‌రైన‌ స‌లీల్ అంకోలా(Salil Ankola) స్థానాన్ని అజ‌య్ భ‌ర్తీ చేయ‌నున్నాడు. ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం బీసీసీఐ (BCCI) వెల్ల‌డించింది.

Ajay Ratra (photo/X/BCCI)

బీసీసీఐ కొత్త సెలెక్ట‌ర్‌గా అజ‌య్ రాత్రా(Ajay Ratra) ఎంపిక‌య్యాడు. ప్ర‌స్తుతం సెలెక్ట‌న్ ప్యానెల్ స‌భ్యుల్లో ఒక‌రైన‌ స‌లీల్ అంకోలా(Salil Ankola) స్థానాన్ని అజ‌య్ భ‌ర్తీ చేయ‌నున్నాడు. ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం బీసీసీఐ (BCCI) వెల్ల‌డించింది.ద‌క్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌లో భార‌త జ‌ట్టు కోచింగ్ బృందంలో స‌భ్యుడైన అజ‌య్ .. చీఫ్ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్(Ajit Agarkar) నేతృత్వంలోని బృందంతో అజ‌య్ క‌లిసి ప‌ని చేయ‌నున్నాడు. నిరుడు ద‌క్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్ ఆడిన భార‌త జ‌ట్టు కోచింగ్ బృంద‌లో అజ‌య్ స‌భ్యుడు’ కూడా అని బీసీసీఐ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం అజిత్ అగార్క‌ర్ చీఫ్ సెలెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. శివ్ సుంద‌ర్ దాస్, సుబ్రొతో బెన‌ర్జీ, శ్రీ‌ధ‌ర‌న్ శ‌ర‌త్‌లు సెలెక్ట‌ర్లుగా ఉన్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ తేదీ వచ్చేసింది, తొలిసారి వేదిక కానున్న లార్డ్స్ మైదానం, పూర్తి వివరాలు ఇవే..

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)