Akasa Air: 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కొనుగోలుకు ఆకాశ ఎయిర్‌లైన్స్‌ ఆర్డర్, విమానయాన రంగంలో సంచలనానికి తెరలేపిన ఎయిర్ లైన్స్

ప్రముఖ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్స్‌ 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా ఈవెంట్‌లో దీనికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఈఓ వినయ్ దూబే వెల్లడించారు.

Akasa Air (Photo Credits: ANI)

ప్రముఖ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్స్‌ 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా ఈవెంట్‌లో దీనికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఈఓ వినయ్ దూబే వెల్లడించారు. ఇప్పటికే ఈ కంపెనీ గతంలో 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 22 విమానాలను డెలివరీ చేసుకుని నిర్వహణలో ఉంచింది.

కాగా గత ఏడాది మరో ఎయిర్‌లైన్స్‌లో చేరటానికి ఎలాంటి నోటీసు లేకుండానే సుమారు 40 మంది పైలట్లు రాజీనామా చేయడంలో విమానయాన సంస్థ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో సంస్థ సంక్షోభంలోకి వెళ్ళింది.అనంతరం కొత్త ఫైలెట్లను నియమించుకుని ముందుకు సాగగా నేడు 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలన కొనుగోలుతో విమానయాన రంగంలో సంచలనానికి తెరలేపింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now