Allu Arjun on Sandhya Theatre Stampede: సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటనపై వీడియో విడుదల చేసిన అల్లు అర్జున్, ఏమన్నారంటే..

సంధ్య థియేటర్‌లో జరిగిన విషాద సంఘటనతో తీవ్ర హృదయ విదారకంగా ఉంది. ఈ అనూహ్యమైన కష్ట సమయంలో ఘటనలో దుఃఖిస్తున్న మృతురాలి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ బాధలో వారు ఒంటరిగా లేరని , ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుస్తామని నేను వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను.

Allu arjun condolences on sandhya theatre Stampede incident

పుష్ప 2’ బెనిఫిట్ షో రోజున హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాద ఘటనపై అల్లు అర్జున్ ఒక వీడియో ద్వారా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో రేణుక అనే మహిళ తన ప్రాణాలు కోల్పోవడం, ఆమె కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోవడం తనను ఎంతో బాధించిందని చెప్పారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. “ఈ సంఘటన చాలా బాధాకరం. తల్లిని కోల్పోయిన ఆ కుటుంబం ఆవేదనకు లోనవుతోంది. వారిని ఒంటరిగా వదలకుండా, అన్నివిధాలా సహాయపడతాం” అని తెలిపారు.

వారి కుటుంబం కోసం రూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. అంతేకాక, ఘటనలో గాయపడిన బాలుడి వైద్యం కోసం అవసరమైన అన్ని ఖర్చులను ‘పుష్ప 2’ టీం భరిస్తుందని తెలిపారు.బాధిత కుటుంబం పట్ల నా మద్దతు ఎప్పటికీ ఉంటుంది” అని అన్నారు. ఆ కుటుంబానికి తన వ్యక్తిగతంగా అవసరమైనంత సాయం చేస్తానని, ఈ విషయంలో టీం మొత్తం అండగా నిలుస్తుందని ప్రకటించిన అల్లు అర్జున్, తల్లి కోల్పోయిన కుటుంబాని అతి త్వ‌ర‌లోనే క‌లిసి క‌లుస్తాన‌ని చెప్పారు.

అల్లు అర్జున్ పై కేసు న‌మోదు, మ‌హిళ మృతిపై నిర్ల‌క్ష్యం విష‌యంలో పోలీసుల సీరియస్ యాక్ష‌న్

Allu arjun condolences on Sandhya theatre Stampede incident

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now