Anand Mahindra: వైరల్ అవుతున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్, డాక్టర్ చేతిరాత చూడండి ఎలా ఉందో అంటూ వైరల్ వీడియో పోస్ట్

ఆస్పత్రులకు వెళ్లినప్పుడు వైద్యులు రాసే మందుల జాబితా (ప్రిస్కిప్షన్) ఏదో గీతలు గీసినట్టుగా ఉండటం అందరికీ తెలిసిందే. దీనిపై ఎన్నో సరదా కామెంట్లు, జోకులు కూడా ప్రచారంలో ఉన్నాయి. తాజాగా దీనికి సంబంధించి సరదాగా తీసిన ఓ వీడియోను ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.

Anand Mahindra (Photo-Twitter/@Anand Mahindra)

ఆస్పత్రులకు వెళ్లినప్పుడు వైద్యులు రాసే మందుల జాబితా (ప్రిస్కిప్షన్) ఏదో గీతలు గీసినట్టుగా ఉండటం అందరికీ తెలిసిందే. దీనిపై ఎన్నో సరదా కామెంట్లు, జోకులు కూడా ప్రచారంలో ఉన్నాయి. తాజాగా దీనికి సంబంధించి సరదాగా తీసిన ఓ వీడియోను ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.ఈ వీడియోలో.. పదో తరగతి, తర్వాత ఇంటర్మీడియట్ స్థాయి, ఎంబీబీఎస్, పీజీ చదివే వరకు చేతిరాతను చూపించారు. మొదట చాలా నీట్ గా ఉన్న చేతిరాత కొద్దికొద్దిగా మారిపోతూ వచ్చింది.ఈ వీడియో ఎంత వైరల్ గా మారిందంటే.. రెండు రోజుల్లోనే 19 లక్షల మందికిపైగా దీనిని వీక్షించారు. 57 వేలకుపైగా లైకులు, 8 వేల వరకు రీట్వీట్లు రావడం గమనార్హం.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement