YSRCP Logo (Photo-YSRCP/X)

Vijayawada, JAN 25: విజయసాయి రెడ్డి రాజీనామాపై ఎట్టకేలకు వైసీపీ (YSRCP) అధిష్ఠానం స్పందించింది. విజయసాయి రెడ్డి (Vijayasai Reddy Resignation) నిర్ణయాన్ని ఆమోదించకపోయినప్పటికీ గౌరవిస్తున్నామని తెలిపింది. విజయాలు, కష్టకాలంలో పార్టీకి మూలస్తంభంగా అండగా ఉన్నారని తెలిపింది. రాజకీయాలను వీడి సేద్యం వైపు వెళ్లాలని విజయసాయి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని వైసీపీ తెలిపింది. పార్టీ అభివృద్ధఙ కోసం ఆయన అందించిన సహకారం ఎప్పటికీ తమకు అమూల్యమైనదిగానే ఉంటుందని స్పష్టం చేసింది. భవిష్యత్తు కార్యాచరణ కోసం విజయసాయికి శుభాకాంక్షలు తెలిపింది.

Sharmila On Vijayasai Reddy Resignation: విశ్వసనీయత కొల్పోయిన జగన్.. అందుకే వీసా రెడ్డి రాజీనామా, బీజేపీకి జగన్ దత్తపుత్రుడు అని విమర్శించిన వైఎస్ షర్మిల  

రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని విజయసాయి రెడ్డి (Vijayasai Reddy Resignation) చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇన్నిరోజులు పార్టీలో నంబర్‌ 2గా వ్యవహరించిన ఆయన.. వైసీపీని వీడుతున్నానని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. రాజకీయాలకు గుడ్‌ బై చెప్పిన ఆయన.. ఇవాళ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

YSRCP Reaction On Vijayasai Reddy Resignation

 

రాజీనామా చేయడానికి ముందు జగన్‌తో అన్ని విషయాలను చర్చించానని తెలిపారు. పదవికి రాజీనామా చేయడం సరికాదని కూడా జగన్‌ సూచించారని చెప్పారు. కానీ పదవికి న్యాయం చేయలేకపోతున్నా కాబట్టే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. అబద్ధాలు చెప్పకుండా ఈ రోజుల్లో రాజకీయాలు చేయడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. దైవ భక్తుడిగా నేను అబద్ధాలు చెప్పలేను.. అందుకే తప్పుకుంటున్నానని వివరించారు.

వైసీపీ కోసం 2014 నుంచి సర్వశక్తులూ వినియోగించానని విజయసాయిరెడ్డి తెలిపారు. కార్యకర్తల కోసమే నిరంతరం పనిచేశానని పేర్కొన్నారు. తాను వీడినంత మాత్రాన పార్టీకి నష్టం లేదని అన్నారు. తనలాంటి వాళ్లు పార్టీలో ఇంకా ఉన్నారని.. భవిష్యత్తులో వస్తారని స్పష్టం చేశారు