
Vij, Jan 25: వైఎస్ జగన్‌కి విజయసాయి రెడ్డి చేసి పెట్టని పని అంటూ ఏదీ లేదు అని విమర్శించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila). రాజకీయంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా జగన్‌కి ఆయన ఎన్నో చేసి పెట్టారు అన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీకి రాజీనామా(Sharmila On Vijayasai Reddy Resignation) చేయడం చిన్న విషయం కాదు అన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయాడు కాబట్టే ఆయన రాజీనామా చేశాడు అని విమర్శించారు.
ఇక సాయిరెడ్డికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ జగనే.. గతంలో ఆయన ఎన్నో అసత్యాలు చెప్పారని ఇప్పటికైనా ఆ నిజాలన్నీ బయటపెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు.
తన కుటుంబం, తన పిల్లల మీద విజయసాయిరెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని దుయ్యబట్టారు.జగన్(YS Jagan) నాయకుడిగా ఓడిపోయారని, విశ్వసనీయతను కోల్పోయారని అన్నారు. బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీ(Modi)కి జగన్ దత్త పుత్రుడని విమర్శించారు.
మాజీ మంత్రి వివేకా కేసులో కూడా జగన్ చెప్పమన్న విధంగా అబద్దాలు చెప్పారన్నారు. వీసా రెడ్డి అన్నీ నిజాలు చెబితే.. ప్రజలు ఇప్పుడైనా హర్షిస్తారని చెప్పుకొచ్చారు. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్(Super Six) హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు షర్మిల. తల్లికి వందనం పేరుతో ఒక్కో బిడ్డకు రూ.15 వేలు అన్నారని.. కానీ రాష్ట్రంలో ఒక్క బిడ్డకైనా మీరు డబ్బులు ఇచ్చారా అని నిలదీశారు. విజయసాయి రెడ్డి రాజీనామాపై సీఎం చంద్రబాబు.. నాయకుడిపై నమ్మకం ఉంటే ఉంటారు లేకపోతే పోతారు, వైసీపీలో పరిస్థితికి ఇదే నిదర్శనం అని కామెంట్
దేశంలోనే నిరుద్యోగంలో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని కానీ వారికి చంద్రబాబు చెప్పిన ప్రకారం నిరుద్యోగ భృతి అందడం లేదన్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అని చంద్రబాబు ప్రకటించారని కానీ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయారన్నారు.